![]() |
![]() |

కరోనా మహమ్మారి కోరలు చాచి రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిస్తున్న 'పుష్ప' షూటింగ్ విషయంలో రిస్క్ తీసుకోకూడదని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారు. అందుకని, ముందుగా ఎక్కువమంది ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు అవసరమయ్యే సన్నివేశాలు కాకుండా సెట్స్ వేసి పాటలు తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే, హైద్రాబాదులో ఫారెస్ట్ సెట్ కూడా వేస్తున్నారని కొందరు కథలు అల్లేశారు. అసలు విషయం ఆరా తీయగా అది అబద్ధమని తేలింది. అడవి సెట్టు వంటివి ఏదీ వేయడం లేదని తెలిసింది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప' తెరకెక్కిస్తున్నారు. అడవుల్లో ఫైట్స్, సన్నివేశాలు వంటివి సినిమాలో ఉన్నాయి. మొదటి కేరళలోని అడవుల్లో వాటిని తెరకెక్కించాలని అనుకున్నారు. కరోనా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సరిహద్దులు దాటడం ఎందుకని కేరళ వెళ్లే ప్రయత్నం విరమించుకున్నారు. వికారాబాద్, తలకోన, మారేడుమిల్లి అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ సీన్స్, ఫైట్స్ తీయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు ట్యూన్స్ ఇచ్చారట.
![]() |
![]() |